Telugu Updates
Logo
Natyam ad

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రం ఈనెల 30వ తేదీన 12 పరీక్షా కేంద్రాలలో 4, 820 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో పాల్గొననున్నట్లు తెలియజేశారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ముఖ్య కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రం పరిసరాలలో మరి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదని తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి సందేహాలు లేకుండా నిశ్చింతగా పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలు తెలియజేశారు. పరీక్ష సమయం ఉదయం 10: 00 నుండి మద్యాహ్నం 1: 00 గంటల వరకు నిర్వహించబడుతుందని, విద్యార్థులను ఉదయం 8:45 గంటల నుండి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించ బడుతుందన్నారు. ఉదయం 10:00 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరన్నారు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికేట్, పెన్, ప్యాడ్, పెన్సిల్ తీసుకొనిరావచ్చన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలని, అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్లు అవసరం లేదన్నారు. పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (వేలి ముద్రలు) తప్పనిసరని, తుది రాత పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దనిసూచించారు. విద్యార్థులకు పరిశుద్ధమైన నీరు హాలుకు దగ్గరలో అందుబాటులో ఉంచబడునని, పరీక్ష వేళలు ముగిసే వరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెనని, అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ మరియు సంబంధిత సీట్ చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలన్నారు. అభ్యర్థులు, పరీక్ష విధి నిర్వాహణలో ఉన్నవారు తప్ప వేరే ఎవరూ పరీక్ష మెయిన్ గేట్ దాటి లోపలికి అనుమతించబడతరని, ఒఎంఆర్ షీట్ లో వైట్ నర్ ను ఉపయోగించరాదన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత అందరి ఒఎంఆర్ షీట్స్ తీసుకున్నాక, అందరి బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తి అయ్యాక అందరూ అభ్యర్థులను ఒకేసారి బయటకు పంపిస్తారని తెలిపారు. మీ హాల్ టికెట్ వెనకాల పరీక్ష కు సంభందించిన నియమ నిభంధనలు ఉన్నాయి వాటిని చదువుకొని రావాలన్నారు.