రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి..?

మంచిర్యాల జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయని, రైతులు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యతను పరీక్షించాలన్నారు. వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 73, 632 ఎకరాలలో వరి సాగు చేశారని, రైతులు తమ అవసరాలకు ఉపయోగించుకున్న ధాన్యం పోను కొనుగోలు కేంద్రాలకు 1, 54, 640 మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. అందుకు అనుగుణంగా సివిల్ సప్లై అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు..

Comments (0)
Add Comment