వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా..!

మంచిర్యాల జిల్లా: చమురు, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ కు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుతోందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టి కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను ధారాదత్తం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి అందే మంగ, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు బత్తుల మధు, వామపక్ష నాయకులు ఖలీందర్ అలీఖాన్, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, దాగం మల్లేష్, దాసరి రాజేశ్వరి, దుబాసి అశోక్, దుంపల రంజిత్ కుమార్, దాగం రాజారాం, తోకల తిరుపతి, మల్లన్న, ప్రశాంత్, దొండ ప్రభాకర్, చీర్ల సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment