రావణాసురుడి బొమ్మ కాల్చడం నీచమైన చర్య.?: దళిత సంఘాల ఆగ్రహం.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రపంచంలోనే బలశాలి మహా తపస్వికుడు యోగి ద్రావిడ రాజ్య చక్రవర్తి మహనీయులు రావణ సురుడు బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో భారత దేశంలో రావణ సురుడి బొమ్మలు కాల్చడం బెల్లంపల్లి దళిత సంఘాల నుంచి వ్యతిరేకిస్తున్నామ్, రావణాసురుడు చరిత్ర తెలుసుకొని వాళ్ళు చరిత్ర హీనులు అవుతారు శ్రీలంకలో దేవుడిగా రావణాసురుడు భారతదేశంలో రాక్షసుడు అయ్యాడు భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో రావణాసురుడు కి గుళ్ళు గోపురాలో నిత్యం పూజలు చేస్తారు వేలాది జనం గుమ్మ గూడినప్పుడు మొన్నటికి మొన్న సికింద్రాబాద్ రామ్ లీలా మైదానంలో ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నించారని పత్రికల ద్వారా తెలిసినది అదే బెల్లంపల్లి పట్టణంలో అలాంటి దాడులు జరుగుతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు తొక్కేసిలాట జరిగిన ఆపేది ఎవరు ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే మనం మాత్రం అంధకారంలో ఉన్నామని ఇలాంటి పిచ్చి ఘటనలు మరలా జరగకుండా చూడాలని దళిత సంఘాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు చిలక రాజనర్సు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బాని రాజనర్సు భారత నాస్తిక సమాజం అధ్యక్షులు గుడిసెల శ్రీహరి దళిత శక్తి ప్రోగ్రాం నియోజకవర్గ ఇంచార్జ్ ఏల్తురు శంకర్ మాదిగ దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు రమేష్ దుర్గయ్య రాజన్న తదితరులు పాల్గొన్నారు.