ట్యాంకర్లపై ఫోటోలతో ప్రచారం చేసుకోవడం విడ్డూరం..!

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రస్తుత ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా మంచినీరు సరఫరా చేస్తున్న మున్సిపల్ ట్యాంకర్లపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఫోటోల ప్లెక్సీతో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్, షేక్ మజీద్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ జనరల్ ఫండ్ సుమారు రూ. 44 లక్షలతో కొనుగోలు చేసిన 8 ట్రాక్టర్లపై ఫోటోల విషయంలో 36 వార్డులకు గాను మిగతా 35 మంది కౌన్సిలర్లను విస్మరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత వల్లే మిషన్ భగీరథ పనులు పూర్తి కాక ట్యాంకర్ల ద్వారా పట్టణ ప్రజలకు నీటిని సరఫరా చేసే దుస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు..

వెంటనే వాటర్ ట్యాంకర్లపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అందరి ఫోటోలతో పాటు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఫోటోలు గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న ఫ్లెక్సీలు తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సల్ల మహేష్, రామగిరి బానేష్, సునీత ప్రభాకర్, కొండ పద్మ చంద్రశేఖర్, జోగుల శ్రీలత సదానందం పాల్గొన్నారు.

Comments (0)
Add Comment