సరి కొత్త సొబగులతో కొత్త చెరువు ముస్తాబు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుకు సరి కొత్త కొత్త కళ వచ్చింది. రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు ఆలోచనలకు అనుగుణంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్ గా. పురప్రజలకు ఆహ్లాదం ను పంచే గమ్య స్థానం గా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ల మార్గదర్శనం లో పురపాలక అధికారులు తీర్చిదిద్దుతున్నారు. రూ. 11 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి సుందరీకరణ, ముస్తాబు చేస్తున్న కొత్త చెరువు లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా కొత్త చెరువు ను ముస్తాబు చేశారు. బండ్ రహదారి వైపున ఆకట్టుకునేలా జంతువులు, పక్షులతో కూడిన ఆకారాలు రూపొందించి ఆకర్షించేలా రంగులు వేశారు.

1. 8 కిలో మీటర్ ల మేర ట్యాంక్ బండ్ ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే విధంగా వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ గ్రీనరి, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. పిల్లలకు కోసం ప్రత్యేక రైలు, వేకువ జామున ఆరోగ్య క్రియలు చేసేందుకు యోగ శాల, క్యాంటీన్, చిన్నచిన్న బర్త్ డే పార్టీ లాంటి శుభ ర్యాలు చేసుకునేలా వేదిక, వసతులతో పాటు జలాశయంలో విహారించేందుకు బోటింగ్ సౌకర్యం కల్పించారు. రాత్రి వేళల్లో ట్యాంక్ బండ్ దేదీప్యమానంగా వెలుగొందేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు.

త్వరలోనే రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు చేతుల మీదుగా పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసిన కొత్త చెరువు ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Comments (0)
Add Comment