ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని ఆండాళ్ దేవి నగర్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆదివారం మహాత్మా గాంధీ జయంతి నీ పురస్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాత మంచిర్యాలకు చెందిన మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత ఆమె భర్త పెంట రమేష్ దంపతులు గాంధీ విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహాన్ని ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు ప్రేమ్‌సాగర్ రావు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ. మహాత్మా గాంధీ జయంతి రోజున గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గాంధీ విగ్రహాన్ని తయారు చేయించిన రజిత రమేష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతోపాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.