కుందారంలో చిరుతపులి పాదముద్రలు కలకలం

చిరుతపులి సంచరిస్తున్నందున అడవుల్లోకి వెళ్ళవద్దు

కుందారం సమీపంలోని టి.ఎస్.ఎఫ్.డి.సి నీలగిరి ప్లాంటేషన్ వద్ద చిరుతపులి పాదముద్రలు గుర్తించిన

మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలోని కుందారం -జైపూర్ క్రాస్ రోడ్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ.. కుందారం సమీపంలోని అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి)నీలగిరి ప్లాంటేషన్ వద్ద రెండు రోజుల కిందట సంచరించిన చిరుత పులి పాదముద్రలు  గుర్తించామని చెప్పారు. అటవీ ప్రాంతం సమీప ప్రాంతాలైన కుందారం, నర్సింగాపూర్, మద్దులపల్లి, ఆరెపల్లి నివాసితులు అడవి లోకి రావద్దన్నారు. చిరుత పులి సంచారం దృష్ట్యా తమ పంట పొలాలకు ఎవరూ కరెంట్ తీగలు వాడవద్దని చెప్పారు. చిరుత పులి కి హాని కలిగించే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దన్నారు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం సహజమని, అది తన ఆవాసం, జీవనం కోసం వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుందని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ మరియు అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి) అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలు అడవిలోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Comments (0)
Add Comment