ఫైన్ఆర్ట్స్ పైన పరీక్షల నిర్వహణ..?

శ్రీ నందిని నృత్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి, భరత నాట్యం, ఫైన్ఆర్ట్స్ పైన పరీక్షల నిర్వహణ

మంచిర్యాల జిల్లా: ప్రాచీన కళాకేంద్ర చండీఘర్ తాండవ కృష్ణ నృతాలయం ప్రోత్సాహంతో శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్ నాట్య శ్రీ అన్నం కల్పన గారి ఆధ్యర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ నందిని నృత్యాలయంలో సోమవారం కూచిపూడి నృత్యం, భరతనాట్యం, ఫైన్ ఆర్ట్స్, పైన పరీక్షలు నిర్వహించడం జరిగినది.. దీనికి ఎగ్జామినర్స్ గా శ్రీమతి శ్రీదేవి గారు, శ్రీ ప్రభాకర్ గారు వ్యవహరించారు. ఈ సంధర్భంగా శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్ నాట్య శ్రీ అన్నం కల్పన గారు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో మొదటిసారిగా ఈ పరీక్ష కేంద్రాన్ని నిర్వహించడానికి ప్రోత్సహించిన శ్రీ తాండవ కృష్ణ నృత్యాలయం పౌండర్ నాట్య శ్రీ ఉదయశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దీనికిగాను ఉదయశ్రీ గారు మాట్లాడుతూ… విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో “కళలు” కూడా అంతే ముఖ్యమని పిల్లలు కళలలో రానించాలని, ఈ కళ మానసిక ఉల్లాసం తో పాటు శరీరక ఎదుగుదలకు ఎంతో తోడ్పటమే కాకుండ సమాజంలో వారికి “కళా”. మంచి గుర్తింపును గౌరవాన్ని సంపాదించి పేడుతాయని ఆమే పేర్కొన్నారు.. ఇందులో భాగంగా గురువులు శ్రీ మోహినుద్దీన్ గారు, మరియు శ్రీమతి యమున గారు వారి శిష్యులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment