కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్.!

రాజన్న సిరిసిల్ల జిల్లా: డబ్బులు కావాలని జిల్లా అధికారులకు 7466905844 తో వాట్సాప్ మెసేజ్ లు వెంటనే కలెక్టర్ కు సమాచారమిచ్చిన అధికారులు ఎవరూ స్పందించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్ లను సైతం టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ కేటుగాళ్లు పలువురు అధికారులను డబ్బులు డిమాండ్ చేశారు.

ఓ జిల్లా అధికారికి ఈ రోజు రాత్రి వాట్సాప్ నం. 7466905844 ద్వారా డబ్బులు కావాలని మెసేజ్ చేశారు. తక్షణమే అప్రమత్తమై న ఆ అధికారి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో మాట్లాడారు. తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్లకు సంబంధించి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్ అనురాగ్ జయంతి. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించి ఎవరూ స్పందించవద్దని జిల్లా అధికారులందరికీ సమాచారమందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. తన ఫొటోతో కూడిన నకిలీ వాట్సాప్ ఖాతాతో ఎవరైనా జిల్లా అధికారులను గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, ప్రజలను గానీ డబ్బులడిగితే స్పందించవద్దని, సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ద్వారా సూచించారు.

Comments (0)
Add Comment