అన్నదాతల అభిప్రాయాల మేరకే రైతు భరోసా సదస్సులు

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి  పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు  చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా  ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతుభరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాలను  క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షేత్రంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేసి తీరుతుంది అన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద బడుగు వర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. రైతు భరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదని, గ్రామం యూనిట్ గా తీసుకోవాలని రైతులు ఎక్కువమంది సూచిస్తున్నారని పేర్కొన్నారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ఆర్థిక భారం దృష్ట్యా పెద్ద రైతులకు పక్కనపెట్టి పేద, దళిత గిరిజన రైతులకు అందించాలని పలువురు రైతులు కోరారు. మేస్రం జంగు అనే గిరిజన రైతు మాట్లాడుతూ. వర్షాధారంపైనే  తాము పంట సాగు చేస్తున్నామని, ఖర్చులు పోను ఏమీ మిగడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా సగం వంతు, మిగిలిన సగం ఆర్థిక సాయం పట్టా రైతులకు అందించాలని అన్నారు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది ఎకరాల సాగు చేసే రైతులందరికీ తప్పకుండా రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సర్కారు పంటల  సాయం నిలుపుదల చేయాలని, రియల్‌ ఎస్టేట్‌ భూములు, సాగుకు పనికిరాని బీడు భూములకు కూడా పంటల పెట్టుబడి సాయాన్ని ఆపివేయాలని ప్రకాష్, గుణవంతు, అనే  రైతులు కోరారు.

Comments (0)
Add Comment