భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు..

తొలి విడత లక్ష మందికి..

తెలంగాణ: రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తొలి విడతగా లక్ష మందికి రాయితీపై మోటారు సైకిళ్లను అందిస్తామని పేర్కొంది. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు భవన నిర్మాణ కార్మికులు 21.46 లక్షల మంది ఉన్నారు. వీరిలో 12.68 లక్షల మంది ఏటా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటున్నారు. పథకం కింద 35  ఏళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకోవాలా? వయసుతో సంబంధం లేకుండా అర్హత ఉన్నవారికి ఇవ్వాలా అనే అంశంపై కార్మికశాఖ సమాలోచనలు చేస్తోంది. లక్ష వాహనాల్లో గరిష్ఠంగా 30-50 శాతం వరకు సబ్సిడీ భరించే అవకాశాలున్నట్లు సమాచారం. తొలి విడత కింద పథకం వ్యయం రూ.300-500 కోట్ల వరకు ఉండవచ్చని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి..

Comments (0)
Add Comment