Telugu Updates
Logo
Natyam ad

అల్ఫోర్స్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఆల్ఫోర్స్ పాఠశాల ఇన్చార్జి  ప్రిన్సిపాల్ రాజమణి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డు లో గల అల్ఫోర్స్ పాఠశాలలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి గురువులందరినీ స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రాజమణి మాట్లాడుతూ… ” అ, ఆ ల నుంచి గుణింతాల వరకు, అంకెల నుంచి లెక్కల వరకు, పిల్లల పాటల నుంచి చరిత్ర వరకు, ఆటల నుంచి సైన్స్ వరకు అన్నీ దండించైనా దగ్గరుండి నేర్పించిన ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ.. ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిదని మనలోని శక్తిని గుర్తించేది సానబట్టేది, అందమైన భవిష్యత్తు దిశగా నడిపించేది ఉపాధ్యాయుడే అని, గురువు అనే నిచ్చెనతోనే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాం. ఈ స్థాయికి నేను చేరుకున్నానంటే దానికి కారణం నా గురువులేనని, సాధిస్తాననే నమ్మకం నాకు లేకపోయినా. సాధించాలనే ఆసక్తి లేకపోయినా. దిక్సూచిలా నన్ను ముందుకు నడిపించారని వారి గురువులను స్మరించారు.

అనంతరం పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించి స్వయం పాలనాదినోత్సవాన్ని నిర్వహించారు. గురువులను విద్యార్థులు సన్మానించి కళాశాల అధ్యాపకుల చేత కేక్ కట్ చేయించారు. ఇంచార్జి ప్రిన్సిపల్ కి శాలువాతో సన్మానించి విద్యార్థులు వారి అధ్యాపకులకు బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు..