Telugu Updates
Logo
Natyam ad

అల్ఫోర్స్ లో ఘనంగా ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

రాధాకృష్ణుల వేషధారణలో ఆల్ఫోర్స్ పాఠశాల చిన్నారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్ లో గల ఆల్ఫోర్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ముందస్తు గా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని ఆరాధించిన వారు నిత్యం శుభఫలాలు పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని, కృష్ణాష్టమి పండుగ యువతలో చాలా ఉత్సహాన్ని నింపుతుందని, ప్రతి ఒక్కరు సోదర భావం భక్తి భావంతో ఉండాలని, పలు పూజా కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా చేపట్టి భగవంతుని ఆశీస్సులు పొందాలని, ఉత్సాహానికి ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తున్న శ్రీకృష్ణాష్టమి అత్యంత భక్తిశ్రద్ధలతో కుటుంభసభ్యులతో ఆనందోత్సవాల మధ్య నిర్వహిస్తారని విద్యార్థులకు చదువుతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను మరచిపోకుండా కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నారులందరు రాధాకృష్ణ వేషధారణలో కలకలలాడుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణుని గోపికల వేషాధారణలతో విచ్చేసి పండుగ వాతవరనం రెట్టింపు చేశారని, విద్యార్థులు ప్రదర్శించినటువంటి నందగోపాల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాజ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.